ఏముందిరా బాబూ ఆ వీడియోలో.. ఉన్నదే 2 సెకన్లు.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోనే.. ఈ పోస్టునే కనిపిస్తుంది.. ఫేస్ బుక్ ఓపెన్ చేసినా.. X ఓపెన్ చేసినా.. ఇన్ స్టా అయినా.. వారం రోజులుగా ఈ వీడియోనే ప్రత్యక్ష్యం.. ఇంతకీ ఈ వీడియోలో ఏముందీ అని చూస్తే.. కళ్లు మూసి తెరిచే లోపు అయిపోతుంది.. రెండు అంటే 2 సెకన్లు ఉన్న ఈ వీడియో ఫుల్ వైరల్.. ఇంతకీ ఈ వీడియో ఏంటీ అంటారా..
సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించేవారికి ఇప్పటికే వైరల్ గర్ల్ ప్రియాంగ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ అమ్మాయే కనిపిస్తోంది. ఇంత వైరల్ అవ్వడానికి ఆ అమ్మాయి పెద్దగా చేసింది ఏమిలేదు. జస్ట్ రెండు సెకన్ల వీడియో ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. వైట్ కలర్ టాప్, వెండి ఆభరణాలు, ముద్రించిన బందన (రుమాలు మాదిరి) ధరించి అలా ఆటోలో ప్రయాణిస్తూ “మేకప్ ఏట్ టుడే” అనే క్యాప్షన్‌తో సెల్ఫీ వీడియా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలింది అంతే. @w0rdgenerator అనే యూజర్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.
ఈ రెండు సెకన్ల వైరల్ వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్రపంచంలో పెను తుఫాన్ సృష్టించింది. వారం వ్యవధిలోనే ఈ వీడియోను 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఈ వ్యూస్ చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఒరేయ్ అసలు ఆ వీడియోలో ఏముందిరా బాబు 10 మంది కోట్ల మంది చూడటానికి అని కొందరు.. అమ్మాయి అయితే చాలు కంటెంట్ లేకున్నా కక్కుర్తి పడతారనడానికి ఈ వీడియోనే నిదర్శమని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక్క వీడియోతో యువతి ఫేట్ మారిపోయిందని.. ఈ వీడియో ద్వారా బంధన్ గర్ల్ ఎక్స్ నుంచి భారీగా సంపాదిస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
