లీకేజీలకు కేరాఫ్ బీఆర్ఎస్ సర్కార్: మల్ రెడ్డి రంగారెడ్డి

లీకేజీలకు కేరాఫ్ బీఆర్ఎస్ సర్కార్: మల్ రెడ్డి రంగారెడ్డి
  • ప్రజా సంపదను దోచుకుతింటున్న అధికార పార్టీ నేతలు 
     

ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో అవినీతికి, బంధుప్రీతికి, భూ కబ్జాలకు, పేపర్ లీకేజీలు కేరాఫ్​గా బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయి.. ప్రజాసంపదను దోచుకుతింటుందని మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడుమల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. రాహుల్​ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా స్ఫూర్తి ర్యాలీ పేరుతో గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి మంచాల మండలం నోముల వరకు కాంగ్రెస్ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా మల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు సెప్టెంబర్​ 7న భారత్ జోడోయాత్ర మొదలుపెట్టి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరగడం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.  కేంద్రంలోని బీజేపీకి తోక పార్టీగా బీఆర్ఎస్ మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీకి గుత్తేదారుగా ఉన్న కల్వకుంట్ల కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పొలిమేరల నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు.

 శంషాబాద్​లో..

 శంషాబాద్: శంషాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్, మున్సిపల్ అధ్యక్షుడు, కౌన్సిలర్ సంజయ్ యాదవ్,  డీసీసీ అధికార ప్రతినిధి మైలారం సులోచన ఆధ్వర్యంలో నిర్వహించిన జోడో యాత్ర ఏడాది సంబురాల్లో రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ ముదిరాజ్​ పాల్గొని ర్యాలీ తీశారు.

 అల్వాల్​లో.

అల్వాల్ :  మేడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ హాజరై ఓల్డ్ అల్వాల్ చౌరస్తా లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి భారీ ర్యాలీ తీశారు. కాంగ్రెస్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు.