హక్కుల కోసం మాలలు ఐక్యంగా పోరాడాలి : మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు గుంతేటి వీరభద్రం

హక్కుల కోసం మాలలు ఐక్యంగా పోరాడాలి : మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు గుంతేటి వీరభద్రం

కామేపల్లి, వెలుగు: హక్కుల సాధన కోసం మాలలు ఐక్యంగా పోరాడాలని హైకోర్టు అడ్వకేట్ పల్లా రాజశేఖర్, అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లింగాల రవి, మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు గుంతేటి వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం కొత్త లింగాలలో నిర్వహించిన మాలల న్యాయ పోరాట సభకు మంచాల నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దుచేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారిని, వెనుకబడిన వారిని వర్గీకరించి ఎస్సీల్లో 59 కులాలకు న్యాయం చేయాలని కోరారు. 

ఎన్నికల ముందు చేవెళ్ల సభలో కాంగ్రెస్ పెద్దలు చేసిన ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్‌‌‌‌లో హామీలను ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని సూచించారు. మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.750 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీం కన్వీనర్ దాసరి రమేశ్‌‌‌‌, తెలంగాణ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు, రిటైర్డ్ జీఎం వెంకటేశ్వర్లు, దేవాదానం, కో కన్వీనర్లు కమలాకర్, కమలాకర్, రాగన్ బాబు, శనగ స్వామి, రాజశేఖర్, లక్ష్మయ్య పాల్గొన్నారు.