బషీర్‌బాగ్, వెలుగు: కుల సర్వే తప్పుల తడకగా ఉందని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. జనాభా గణాంకాలను ఆధారంగా చేసుకొని ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246ను ఉల్లంఘిస్తూ, కేంద్ర గణాంకాల చట్టం–1948కు వ్యతిరేకంగా చట్టబద్ధత లేని కుల జనాభా సర్వే నిర్వహించారని విమర్శించారు. మాల, మాల అనుబంధ కులాల జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపించారని ఆయన ఆరోపించారు.

