
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సుమారు 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అరుదైన రికార్డు సృష్టించారు. గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరిట ఉన్న రికార్డును తమ దేశ అధ్యక్షుడు బద్దలు కొట్టినట్టు ఆయన కార్యా లయం ఇవాళ వెల్లడించింది.
మే 3న ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రారంభమైన ఆయన మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ 14 గంటల 54 నిమిషాలు కొనసాగింది. మధ్యలో ప్రార్థనల కోసం చిన్న విరామం తీసుకున్నారు. 2019లో ఉక్రెయిన అధ్యక్షుడు 14 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల ద్వారా ప్రజలు అడిగిన ప్రశ్నల కు కూడా ఆయన సమాధానాలు చెప్పారు.