మగ ఉద్యోగులు తగ్గారు

మగ ఉద్యోగులు తగ్గారు

1993–94లో 21.9 కోట్ల మంది మగ ఉద్యోగులు ఉండేవాళ్లు. ఆసంఖ్య 2011–12 నాటికి 30.4 కోట్లకు పెరిగింది. ఈ లెక్కన ఐదేళ్లలో మగ ఉద్యోగులు మరింత  పెరగాలి. కానీ, తగ్గిండ్రు. 2017–18 నాటికి ఉన్నమగ ఉద్యోగులు 28.6 కోట్లు . అంటే దాదాపు 2కోట్లు తగ్గుదల. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడాలేనే లేదు. అన్ని చోట్లా ఒకే తంతు . పట్టణాల్లో మగఉద్యోగులు 4.7 శాతం తగ్గితే పల్లెల్లో తగ్గుదల ఎక్కువగా ఉంది. 6.4 శాతం తగ్గుదల నమోదైందక్కడ. పట్టణాల్లో నిరుద్యోగి త రేటు 7.1 శాతం నమోదవగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.8 శాతంగా రికార్డయిం ది. ఇక, పోయినేడాది ఉద్యోగాల కల్పన కూడా చాలా వరకు తగ్గినట్టు సర్వేలో తేలిం ది. ఈ డేటా మీద మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అయినా కూడా ఉద్యోగాలు పోయినట్టు , కొన్ని ఉద్యోగాలే సృష్టిం చినట్టు స్పష్టం గా తెలుస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నిపుణుడు చెప్పా రు.

జూలై 2017 నుంచి జూన్​ 2018 మధ్య గణాంకాల ఆధారంగా పీఎల్ ఎఫ్ ఎస్ సర్వే చేసింది ఎన్​ఎస్ ఎస్వో. గత ఏడాది డిసెంబర్ లోనే ఆ నివేదికకు జాతీయ గణాంక కమిషన్​ ఆమోదం తెలిపింది. విడుదలచేసేం దుకు ఓకే చెప్పింది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతో జనవరిలోకమిషన్​ ఇన్​చార్జి చైర్ పర్సన్​ పీసీ మోహనన్​, సభ్యురాలు జేవీ మీనాక్షి తప్పుకున్నారు.ఉద్యోగాల్లోనూ భారీ కోతమొత్తంగా ఉద్యోగాల్లోనూ భారీగానే కోత పడినట్టు ఎన్​ఎస్ ఎస్ వో సర్వేలో తేలిం ది. ఐదేళ్లలో 4.7 కోట్ల ఉద్యోగాలకు కత్తెర పడినట్టు తేలి పోయింది. ఆ లెక్క సౌదీ అరేబియా జనాభా కన్నా ఎక్కు వే. గ్రామీణప్రాంతాల్లో 2011–12 నాటికి 30.9 కోట్ల మంది ఉద్యోగులుంటే.. 2017– 18 నాటికి ఆ సంఖ్య 26.6 కోట్లకు తగ్గింది. అంటే మొత్తంగా అక్కడ 4.3 కోట్ల ఉద్యోగాలు పోయాయి. ఇటు పట్టణ/నగరాల్లోనూ కొంచెం తక్కు వే అయినా, ఉద్యోగాలు పోవడం మాత్రం కామనే. ఈ ఐదేళ్లలో 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలు పోగా.. 10.7 కోట్లకు పరిమితమయ్యాయి. 2011–12లో 11.1 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగింది. గ్రామాల్లో ఎక్కువగా  ష్టపోయింది మహిళలైతే (68%), పట్టణాల్లో పురుషులు (96%) భారీగా నష్టపోయారు.

మగ ఉద్యోగుల చిట్టా (కోట్లలో)

ఏడాది          పట్టణాలు        పల్లెలు         మొత్తం

2017–18       8.492       20.11         28.6

2011–12       8.915       21.488       30.4

2004-05        7.079       20.158       27.2

1999-2000    6.221      18.73          25

1993–94       5.744      16.158         21.9

పల్లెలువులు (కోట్లలో)

ఏడాది           మహిళలు         మగాళ్లు           మొత్తం

2017–18       6.48            20.11            26.6

2011–12       9.392          21.488           30.9

2004–05       11.614        20.158           31.8

నిరుద్యోగం పెరిగింది

2011–12లో 2.2 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2017–18కి వచ్చేటప్పటికి 6.1శాతానికి రయ్యున గబాకింది. ఇక, 2004–05 నుంచి 2011–12 మధ్య కాలంలో గ్రామాల్లో మహిళా ఉద్యోగులు 2.2 కోట్లు తగ్గినా , అదే టైంలో పురుష ఉద్యోగులు 1.3 కోట్లు పెరిగారని నాటి సర్వేలో (2011–12) తేలిం ది. మొత్తంగా అదే కాలంలో 90 లక్షల ఉద్యోగాలు పోయాయి. కానీ, అప్పటి నుంచే మగ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చిందనితాజా సర్వే వెల్లడించిం ది. ఆనాటి జాతీయ నిరుద్యోగితతో పోలిస్తే ఇప్పుడు మగ ఉద్యోగులు నాలుగున్నర రెట్ లు తగ్గినట్టు తేల్చింది. 15–59 ఏళ్ల మధ్య వారికి అందుతున్న ఒకేషనల్ /టెక్నికల్ శిక్షణ 2 శాతానికి తగ్గింది. 2011–12లో 2.2 శాతంగా ఉండేది. అయితే, 15 నుంచి 29 ఏళ్ల యువతకు శిక్షణ 0.1 శాతం పెరిగింది.