
బెంగళూరు: వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో సెమీస్‌లో సెంట్రల్ జోన్ దీటుగా బదులిస్తోంది. డానిల్ మాలేవర్ (76), శుభమ్ శర్మ (60 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలు చేయడంతో.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు సెంట్రల్ తొలి ఇన్నింగ్స్‌లో 67 ఓవర్లలో 229/2 స్కోరు చేసింది. శర్మతో పాటు రజత్ పటీదార్ (47 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్ ఆయుష్ పాండే (40)తో తొలి వికెట్‌కు 67 రన్స్ జత చేసిన డానిష్.. శుభమ్‌తో రెండో వికెట్‌కు 93 రన్స్ జోడించాడు. తర్వాత పటీదార్ మూడో వికెట్‌కు అజేయంగా 69 రన్స్ జత చేసి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. అంతకుముందు 363/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 438 రన్స్‌కు ఆలౌటైంది. తనుష్ కొటియాన్ (76), శార్దూల్ ఠాకూర్ (64) ఏడో వికెట్‌కు 84 రన్స్ జత చేశారు. ధర్మేంద్రసింగ్ జడేజా (1), అర్జాన్ (3) ఫెయిలయ్యారు. సారాన్ష్ జైన్, హర్ష్ దూబే చెరో మూడు వికెట్లు తీశారు.