
మల్కాజిగిరి, వెలుగు: అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మల్కాజిగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చేశానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం వినాయక్ నగర్ డివిజన్లోని మాజీ కార్పొరేటర్ బద్దం పుష్పలత పరశురాం రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అయ్యాక అనేక నిధులు రాబట్టి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు.
వాజ్పేయినగర్అండర్పాస్, ఆర్.కె.పురం ఫ్లైఓవర్, తుర్కపల్లి, గౌతమ్‌నగర్, జనప్రియ ఆర్‌యూబీలు, ఏవోసీ రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. గౌతమ్ నగర్ రిజర్వాయర్, సఫిల్‌గూడ యూపీహెచ్సీకి 500 గజాల స్థలం, జిల్లా కోర్టు భవనం, అల్వాల్ ఫైర్ స్టేషన్ కు స్థలం తదితర అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత, రాముయాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీశ్‌గౌడ్, ఏకే మురుగేశ్, బీఆర్‌ఎస్ నాయకులు బద్దం పరుశురాంరెడ్డి, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతురావు, రాము యాదవ్, చిన్న యాదవ్, ఉస్మాన్, శివ గౌడ్ పాల్గొన్నారు.