- సీసీ కెమెరాల్లో కూడా చూస్తం
- హాస్టల్ ఓనర్లు స్పందించకపోతే మూసేస్తం
- మల్కాజిగిరి సీపీ సుమతి వార్నింగ్
మలక్‌పేట, వెలుగు: మల్కాజిగిరి కమిషనరేట్పరిధిలో ఇక నుంచి హాస్టల్స్‌లో ఉంటున్న స్టూడెంట్స్పై డ్రోన్‌కెమెరాలతో నిఘా పెడతామని, అర్ధరాత్రిళ్లు ఎటు వెళ్తున్నారన్నది గమనిస్తామని, మిడ్‌నైట్‌లో బయట కనిపిస్తే పెట్రోలింగ్ పోలీసులతో డ్రగ్స్టెస్టులు చేయిస్తామని సీపీ సుమతి హెచ్చరించారు. గురువారం రాత్రి దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్ఓనర్లతో కో ఆర్డినేషన్మీటింగ్నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సీపీ సుమతి మాట్లాడుతూ.. కమిషనరేట్పరిధిలో ఎన్నోచోట్ల హాస్టల్స్ఉన్నా ఇదే ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం ఉందన్నారు. ఇక్కడికి ఎన్నో ప్రాంతాల నుంచి స్టూడెంట్స్వస్తారని, ఈ ఏరియా కేంద్రంగా ఉంటారు కాబట్టే ఎక్కువ ఫోకస్చేయాల్సి వస్తుందన్నారు. చాలామంది దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, చుట్టుపక్కల హాస్టల్స్‌లో ఉంటారని, అందులో అదుపు తప్పేవారిని కంట్రోల్చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో 3,200 కు పైగా కెమెరాలు ఉన్నాయని, వీటితో తమ నిఘా ఎప్పుడూ కొనసాగుతుందన్నారు. వీటితో పాటు డ్రోన్పోలీసింగ్కూడా ఉంటుందని చెప్పారు.
పిల్లలు చెడు వ్యసనాలకు లోనైతే వారి తల్లిదండ్రులకు చెప్పేలా హాస్టల్ నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాన్నారు. హాస్టల్స్‌లో తప్పుడు పనులు జరిగితే ఓనర్స్యాక్షన్తీసుకోవాలని, లేకపోతే తాము మూసెయ్యాల్సి వస్తుందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కంట్రోల్లో పెట్టాలన్నారు. యూత్చెడు డ్రగ్స్‌వంటి వాటికి దూరంగా ఉండాలని, వాళ్లు మారకపోతే ఆ పని తాము చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ కృష్ణయ్య, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎఫ్ఓ సీనయ్య, ఎంఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ హాజరయ్యారు.
