సక్సెస్ కు నేనే మోడల్

సక్సెస్ కు నేనే మోడల్

ప్రేమలో పడొద్దని విద్యార్థులకు సూచించారు మంత్రి మల్లారెడ్డి. కండ్లకోయలో ఐటీ టవర్ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు మల్లారెడ్డి. ఈ సందర్బంగా స్టూడెంట్స్ ను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రతీ ఒక్క స్టూడెంట్ తన లాగా కష్టపడి పైకి రావాలన్నారు.  ఒకప్పుడు తాను పాలు అమ్మినని, పూలు అమ్మినని..  సండే, మండే తేడా లేకుండా కష్టపడ్డానన్నారు. ఇవాళ సీఎం కేసీఆర్, కేటీఆర్ దయ వల్ల మంత్రిని అయినా అని అన్నారు.  సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ..  ‘ సక్సెస్ కు నేనే మోడల్. స్కూల్స్ పెట్టిన కాలేజీలు పెట్టినా, ఎంపీ అయిన, ఎమ్మెల్యే అయిన, మంత్రి అయిన. కేసీఆర్, కేటీఆర్ దయ వల్ల ఈ స్టేజి లో ఉన్న..ఇపుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అయిన, టాప్ టెన్ లో ఉన్న..స్టూడెంట్స్ టైమ్, డబ్బులు వేస్ట్ చేయద్దు... ప్రేమలో పడద్దు, ఫ్రెండ్షిప్ చేయద్దు.ప్రతిరోజు ప్లాన్ తో కొత్త ఐడియాలతో ముందుకెళ్లాలి. విద్యార్థులు కష్టపడితే భవిష్యత్తు మీదే’ అని అన్నారు.

సున్నిపిండి స్నానంతో కలిగే బెనిఫిట్స్ ఇవే..

బల్దియా బడ్జెట్ పై అధికారులు సైలెంట్