సున్నిపిండి స్నానంతో కలిగే బెనిఫిట్స్ ఇవే..

సున్నిపిండి స్నానంతో కలిగే బెనిఫిట్స్ ఇవే..

సున్నిపిండి(బాత్​పౌడర్​)తో స్నానం అంటే పాతపద్ధతి అనుకుంటారు. కానీ దీనివల్ల రిజల్ట్​ చాలా బాగుంటుంది. స్కిన్​ మీది డెడ్​సెల్స్​ పోయి చర్మం మెరుస్తూ, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇదివరకు రోజుల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో సున్నిపిండి వాడేవాళ్లు. కానీ బాత్​సోప్స్​ వచ్చాక ఈ బాత్​పౌడర్​ను చాలామంది మర్చిపోయారు. మళ్లీ ఒక్కసారి దీన్ని ట్రైచేసి చూస్తే రిజల్ట్​ మీకే తెలుస్తుంది.

తయారీ ఇలా..

బియ్యం, శనగపప్పు, మినుములు, పెసలను కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేయాలి. తరువాత ఎండుకర్జూర, కర్పూరం వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్​ చేస్తే బాత్​పౌడర్​ రెడీ. ఈ పొడిలో నువ్వులనూనె వేసి మరీ తడిగా లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి మసాజ్​ చేసుకోవాలి. చివర్లో చర్మానికి కొంచెం నువ్వుల నూనె రాయాలి. లేదంటే ఆవుపాల మీద మీగడ వాడొచ్చు. ఇలా వారానికోసారైనా నలుగు పెట్టుకుంటే బాగుంటుంది. కావాలంటే పసుపు కలపొచ్చు.