చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ టికెట్ ​కోసమే మహేందర్​రెడ్డి సీఎంను కలిసిండు: మల్లారెడ్డి

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ టికెట్ ​కోసమే మహేందర్​రెడ్డి సీఎంను కలిసిండు: మల్లారెడ్డి

హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల బీఆర్ఎస్​ఎంపీ రంజిత్​రెడ్డిపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. అసెంబ్లీ లాబీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్​చాట్​చేస్తూ.. కాంగ్రెస్​పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్​కోసం రంజిత్​రెడ్డి కర్చీఫ్​వేసుకున్నారని అన్నారు. అది తెలిసే పట్నం మహేందర్​రెడ్డి అలర్ట్​అయ్యారని, ఆ టికెట్​కోసమే సీఎం రేవంత్​రెడ్డిని మహేందర్​రెడ్డి, ఆయన భార్య కలిశారని చెప్పారు. 

కేసీఆర్​కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టుగానే తన కుటుంబంలోనూ మూడు పదవులు ఉండాలని భావిస్తున్నానని మల్లారెడ్డి అన్నారు. తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని, కేసీఆర్​ఆదేశిస్తే పోటీ చేస్తాడని తెలిపారు. మెదక్​ఎంపీ టికెట్​కోసమే జగ్గారెడ్డి సీఎం రేవంత్​రెడ్డిని పొగుడుతున్నాడని, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్​కావడానికే తన పేరు ఎత్తుతుండని చెప్పారు. తన పేరు చెప్పకపోతే ఆయనను ఎవరూ పట్టించుకోరని అన్నారు.