విజన్ లేదు.. సొల్యూషన్ లేదు..సెంట్రల్ బడ్జెట్పై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కామెంట్

విజన్ లేదు.. సొల్యూషన్ లేదు..సెంట్రల్ బడ్జెట్పై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కామెంట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–-27 బడ్జెట్ లో పాలసీ విజన్ లేదు.. దేశానికి ఎదురవుతున్న సవాళ్లలో ఒక్కదానికి కూడా పరిష్కారం చూపలేదు’’అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్ర బడ్జెట్​పై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విధానపరమైన దృక్పథం, రాజకీయ సంకల్పం లేవు. మోదీ ప్రభుత్వం వద్ద ఐడియాలు అయిపోయాయి. 2026లో దేశానికి ఎదురవుతున్న అనేక ఆర్థిక, సామాజిక, రాజకీయ సవాళ్లకు ఒక్క పరిష్కారం కూడా ఇవ్వలేదు. ‘మిషన్ మోడ్’ ఇప్పుడు ‘చాలెంజ్ రూట్’ అయింది. ‘రిఫార్మ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్’ ఏ ‘రిఫార్మ్’ జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఆగదు’’ అని ఆయన పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

రైతులు ఇప్పటికీ అర్థవంతమైన సంక్షేమ మద్దతు లేదా ఆదాయ భద్రతా ప్రణా ళిక కోసం ఎదురుచూస్తున్నారని ఖర్గే అన్నారు. ‘‘అసమానతలు బ్రిటిష్ రాజుల కాలంలో కంటే ఎక్కువ స్థాయికి చేరాయి. కానీ, బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాని గురించి ప్రస్తావనే లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ సముదాయాలకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి. కానీ, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఊరట ఇవ్వనట్టు కనిపిస్తోంది. ఫెడరలిజం బలిపశువు అయింది’’ అని ఆయన అన్నారు. మాన్యు ఫ్యాక్చరింగ్ రంగం 13 శాతంలోనే స్థిరంగా ఉందని, దానికి పునరుజ్జీవన వ్యూహం లేదని, ‘మేక్ ఇన్ ఇండియా’ ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. ‘‘యువతకు ఎంప్లాయబిలిటీకి లేదా మహిళల వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడానికి గంభీరమైన ప్లాన్ లేదు.

మునుపటి ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్, స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఫలితం ఏమైంది?  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ స్లంప్, టారిఫ్ రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ట్రేడ్ డెఫిసిట్, గ్లోబల్ షేర్ తగ్గడానికి ఎలాంటి స్పందన లేదు. పడిపోతున్న రూపాయికి ఏ ప్లాన్ చేశారు? ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ ఊరట లేదు. సేవింగ్స్ తగ్గుతున్నాయి. డెబ్ట్ పెరుగుతోంది. వేజెస్ స్థిరంగా ఉన్నాయి. కన్స్యూమర్ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రీబూట్ చేయడానికి ఐడియా ఎందుకు లేదు?" అని ఖర్గే ప్రశ్నించారు.