V6 News

ఫ్యూయల్, ఫర్టిలైజర్స్ సప్లైలో కేంద్రం ఫెయిల్..కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

ఫ్యూయల్, ఫర్టిలైజర్స్ సప్లైలో కేంద్రం ఫెయిల్..కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: దేశంలో ఇంధనం, ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ విషయంలో బీజేపీకి ‘డబుల్ ఎఫ్’ (ఫెయిల్) గ్రేడ్‌‌‌‌‌‌‌‌ దక్కుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఆరోపించారు. 

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఇంధన రంగంలో దేశీయ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2014–-15తో పోలిస్తే ఇప్పుడు దాదాపు 22 శాతం తగ్గిందని, 2025–-26 వరకు వరుసగా 11వ సంవత్సరం ఉత్పత్తి పడిపోతుందని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ ఉత్పత్తి కూడా భారీగా తగ్గిందని చెప్పారు.