కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పైన.. నటుడు మమ్ముట్టి భావోద్వేగమైన నోట్

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పైన.. నటుడు మమ్ముట్టి  భావోద్వేగమైన నోట్

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఊమెన్ చాందీ(Oommen Chandy)  మంగళవారం జూలై 18న మరణించిన విషయం తెలిసేందే.  తాజాగా ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి(Mammootty).. ఊమెన్ చాందీ పైన తన కున్న అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగమైన నోట్ ను  ఫేసుబుక్​ద్వారా రిలీజ్ చేశారు.

ఊమెన్ చాందీని మొదటిసారి కలిసిన అనుభవాన్ని పంచుకుంటూ..“సామాన్యుడికి చాలా శక్తి ఉందని చూపించిన అసాధారణ వ్యక్తిత్వం కలిగిన ఊమెన్ చాందీని..జనం మధ్యలో తప్ప నేనెప్పుడూ విడిగా చూడలేదు. నేను అతనిని చివరిసారి చూసినప్పుడు, అతనితో చాలా మంది ఉన్నారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి. ఒకసారి ఆయన పుత్తుపల్లి చర్చి పండుగకు స్నేహితుడిలా పిలిచి నాతో భుజం భుజం కలిపి నడిచాడు. 

ఒకప్పుడు మా 'కేర్ అండ్ షేర్' పథకం.. 600 మంది పిల్లలకు వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులో ఉన్నప్పుడు.. ఒక ప్రతిపక్ష నేతగా 100 మంది పిల్లల శస్త్రచికిత్సల ఖర్చును CSR నిధులను ఉపయోగించి స్పాన్సర్ చేయడానికి అంగీకరించారు. 100వ బిడ్డ కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లినప్పుడు ఊమెన్‌ చాందీ ఆయన్ను చూసేందుకు వచ్చారు. 

చాలా గొప్ప వ్యక్తి పైన ఎన్నో జ్ఞాపకాలు..వెయ్యి అనుభవాలు.. ఎక్కువగా రాయలేను' అంటూ.. భావోద్వేగాన్ని తన నోట్ ద్వారా పంచుకున్నారు మమ్ముట్టి.