
హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో కేంద్ర హోం శాక సహాయక మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం పొద్దున కిషన్ రెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసిఫ్ నగర్ కి వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఓ యువకుడు కాలబెట్టాడు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు.. యువకుడిని కొట్టారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్లెక్సీలను తగులబెట్టిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. ఘటనా స్థలానికి అదనంగా పోలీస్ టీం చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.