మోడీని హత్య చేస్తా.. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి అజ్ఞాత వ్యక్తి ఫోన్

మోడీని హత్య చేస్తా.. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి అజ్ఞాత వ్యక్తి  ఫోన్

ప్రధాని మోడీని హత్య చేస్తానంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది.  2023 మే25 అర్థరాత్రి ఓ వ్యక్తి ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి మోడీని హత్య చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపు కాల్‌తో పోలీసులు రంగంలోకి దిగి వెంటనే కాల్‌ను ట్రేస్ చేశారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని   ఢిల్లీలోని ప్రసాద్ నగర్ ప్రాంతానికి చెందిన 48ఏళ్ల హేమంత్ కుమార్ గా గుర్తించారు.  

పీసీఆర్ కాల్ అందగానే ఒక టీమ్‌ను రంగంలోకి దింపామని, కాలర్‌ను కరోల్ బాగ్‌కు చెదిన 48 ఏళ్ల హేమంత్ కుమార్‌గా గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు  హేమంత్ కుమార్‌ఆరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 

 గత ఆరేళ్లుగా హేమంత్  నిరుద్యోగిగా ఉన్నాడని ఈ క్రమంలో అతను మద్యానికి బానిసయ్యాడని పోలీసుల విచారణలో తేలింది. హేమంత్ మద్యం మత్తులోనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా  గతంలోనూ మోడీని హత్య చేస్తామని పలుమార్లు బెదిరింపు కాల్స్ రావడం  గమనార్హం.