ఎంతకూ అంబులెన్స్ రాలేదు.. చివరకు కూరగాయల బండిపై ఆస్పత్రికి..

ఎంతకూ అంబులెన్స్ రాలేదు.. చివరకు కూరగాయల బండిపై ఆస్పత్రికి..

కొన్నిసార్లు కొన్ని నిముషాల ఆలస్యం కూడా.. విలువైన ప్రాణాలను బలి తీసుకునే పరిస్థితి వస్తుంటుంది. ప్రధానంగా సమాయానికి  అంబులెన్స్ రాకపోవడం, సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చకపోవడం వల్ల.. నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజగా,ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో  హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ  మహిళ తీవ్ర అస్వస్థతలో బాధ పడుతుండగా అంబులెన్స్ కు (108) కు ఫోన్ ఎవరూ స్పందించలేదు.  దీంతో ఆ పేషెంట్ ను ఆమె కుటుంబసభ్యులు  కూరగాయల ( తోపుడు) బండిపై ఆ స్పత్రికి తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది.   దీంతో ఉత్తర ప్రదేశ్ లో ఆరోగ్యశాఖ పనితీరు ఎంత మెరుగ్గా ప్రజలకు అర్దమవుతుంది.  

హమీర్‌పూర్‌లో రద్దీగా ఉన్న రోడ్డుపై తోపుడు బండిపై పేషెంట్ కు దుప్పటి కప్పి తీసుకెళ్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.  ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో యోగీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  ఈ వీడియోపై యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.
సమాజ్ వాదీ పార్టీ ఈ వీడియోను షేర్ చేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అందులో యోగి ప్రభుత్వంలో, ప్రజలు బండ్లపై రోగులను తీసుకెళ్లవలసి వస్తుంది..  హమీర్‌పూర్‌లో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, కుటుంబ సభ్యులు రోగిని తోపుడు బండిపై  ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇది చాలా సిగ్గుచేటు... ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో  ఆరోగ్య వ్యవస్థ గందరగోళంలో ఉందంటూ.. దీనికి ముఖ్యమంత్రి.. ఆరోగ్యమంత్రి బాధ్యత వహించాలంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.   2024లో ప్రజలే దీనికి సమాధానం చెబుతారన్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 

ఈ ఘటన ఆదివారం ( నవంబర్ 5)న జరిగింది.  108 కు అనేక సార్లు ఫోన్ చేసినా సంబంధిత అధికారులు స్పందించలేదని రోగి బంధువులు వాపోయారు.  అప్పటికే పేషంట్ పరిస్థితి విషయమించడంతో బంధువులు కూరగాయలు అమ్మే తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లామని రోగి కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఈ వాదనను అధికారులు తోసిపుచ్చారు.  అంబులెన్స్ కు సంబంధించిన హెల్ప్ లైన్ 108 అని అయితే వారు 0108 కే డయల్ చేశారని అందుకే 108 సిబ్బందికి సమాచారం రాలేదని అధికారులు చెబుతున్నారు. 

ALSO READ : పాము విషం స్మగ్లింగ్ కేసులో బిగ్ బాస్ 2 విన్నర్కు నోటీసులు

వీడియో వైరల్ (Viral photos and videos) అవడంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై ఉన్నతాధికారుల విచారణ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   తోపుడు బండిపై రోగిని తరలించడం బాధాకరమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వైద్యాధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు.