ఫేక్ ​ప్రొఫైళ్లతో సోషల్ మీడియాలో చీటింగ్

ఫేక్ ​ప్రొఫైళ్లతో సోషల్ మీడియాలో చీటింగ్

గచ్చిబౌలి, వెలుగు: సోషల్ మీడియాలో అమ్మాయిల పేర్లతో ఫేక్​ప్రొఫైల్ క్రియేట్​చేసి యువకులను మోసం చేసిన వ్యక్తిని సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్​కు చెందిన శశాంక్​రెడ్డి(24) సిటీలో ఉంటూ జూనియర్​ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు.  వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సోషల్ ఇన్​ఫ్ల్యూయెన్సర్​మేఘనా రఘుపాత్రుని పేరుతో ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​లలో ఫేక్​ ప్రొఫైల్​తో పలువురికి రిక్వెస్ట్​లు పంపాడు. 

గచ్చిబౌలిలో ఉంటూ సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్న యువకుడి(32)కి మేఘనా రఘుపాత్రుని  పేరుతో రిక్వెస్ట్​రావడంతో యాక్సెప్ట్​ చేశాడు. అతనితో శశాంక్​రెడ్డి అమ్మాయిలా చాటింగ్​చేయడం మొదలుపెట్టాడు.  కొద్ది రోజులకు తన తల్లి చనిపోయిందని, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నానని రెంట్, ఈఎంఐ కట్టాలని డబ్బు వసూలు చేశాడు.  డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా పలు కారణాలు చెబుతూ దాటవేస్తుండటంతో మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. పోలీసులు శశాంక్​రెడ్డిని పట్టుకున్నారు. ఇలా రూ.80 లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు.