రైలు కింద పడి భర్త ఆత్మహత్య

రైలు కింద పడి భర్త ఆత్మహత్య

భార్యాభర్తల మధ్య గొడవలే కారణం

రాజేంద్రనగర్, వెలుగు: ఆలుమగలు మధ్య తరచూ జరుగుతున్న గొడవలు భర్త మృతికి కారణమయ్యాయి. విసుగు చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా, మక్తాల్​మండలం సింగం బాండ గ్రామానికి చెందిన సిద్ధూ(30), స్వాతి భార్యాభర్తలు. రాజేంద్రనగర్ సాయిబాబా నగర్ లో ఉంటున్నారు. సిద్ధూ ప్రైవేటు ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే రోజూ తాగి ఇంటికి రావడంతో భార్యాభర్తల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో విసుగు చెందిన సిద్ధూ సోమవారం ఉదయం శివరాంపల్లి– బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వచ్చి బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.