హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు..

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు..

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది.. ఓ వ్యక్తిని నడిరోడ్డుపైనే కత్తులతో పొడిచి చంపేశారు. గురువారం ( డిసెంబర్ 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పాతబస్తీలోని రెయిన్ బజార్ చోటా పూల్ దగ్గర దారుణ హత్య జరిగింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో వివాదం కారణంగా జునైద్ బీ మహమ్మద్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. సమీప బంధువులే ఈ హత్య చేశారని చెబితున్నారు పోలీసులు.

హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా.. చదువుకోమని కుటుంబ సభ్యులు మందలించడంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్​కు చెందిన ఓం ప్రకాశ్​ బిశ్​నాయి జీవనోపాధికోసం నగరానికి వచ్చి జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటూ మార్బుల్​ వ్యాపారం చేస్తున్నాడు. 

ఇతని కొడుకు రాజకుమార్​ బిశ్​నాయి(14) చింతల్​ గాంధీనగర్​లోని ఓ స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం రాజ్​కుమార్​ను చదువుకోమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో గదిలోకి వెళ్లి ఫ్యాన్​కు ఉరేసుకుని చనిపోయాడు. పేట్​ బషీరాబాద్​ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.