కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో విషాదం.. అస్వస్థతకు గురై కార్మికుడు మృతి

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో విషాదం.. అస్వస్థతకు గురై కార్మికుడు మృతి

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలల్లో విషాదం నెలకొంది. పుష్కరాలల్లో విధులు నిర్వహిస్తున్న మంతెన శ్రీనివాస్ (35) అనే కార్మికుడు ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థకు గురై మృతి  చెందాడు. 2025, మే 15న మొదలైన సరస్వతి పుష్కరాల్లో శ్రీనివాస్ అనే వ్యక్తి గత మూడు రోజులుగా పారిశుద్ధ కార్మికుడు(మల్టీ పరపస్ వర్కర్)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అస్వస్థతకు గురయ్యాడు. 

తోటి సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం (మే 19) మృతి చెందాడు. మృతుడి స్వస్థలం కాటారం మండలం గంగారం. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన తమను ఆదుకోవాలని శ్రీనివాస్ కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంది.