ఆర్థిక కష్టాలు.. మెట్రో స్టేషన్ నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక కష్టాలు.. మెట్రో స్టేషన్ నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య

ఢిల్లీలోని యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌ పైనుండి దూకి 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వ్యక్తిని గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన నవీన్‌గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, ఆనారోగ్య సమస్యల కారణంగా అతను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద నుంచి సూసైడ్ నోట్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వీడియో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. అతను పైనుంచి దూకుతున్న సమయంలో చుట్టూ చాలా మంది ఉన్నప్పటికీ, ఎవరూ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన కారణంగా బ్లూ లైన్‌లోని రాజీవ్ చౌక్ మరియు వైశాలి/నోయిడా సిటీ సెంటర్ మధ్య 15 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.