- తన కొడుకును ఆత్మహత్యకు పురిగొల్పిందని ఆరోపణ
మయామి (అమెరికా): కృత్రిమ మేధ మానవ జీవితాల్లో ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో చాటిచెప్పే ఒక అత్యంత బాధాకరమైన సంఘటన అమెరికాలో వెలుగు చూసింది. తనను తాను ‘డిజిటల్ ప్రపంచం’లోకి ఆహ్వానించిందన్న భ్రమలో గూగుల్‌కు చెందిన జెమిని చాట్‌బాట్‌ను ప్రేమించిన ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన జోనాథన్ గవాలాస్ (36) గతేడాది అక్టోబర్ 5న ఆత్మహత్య చేసుకున్నాడు.
జోనాథన్.. తన భార్యతో విడిపోయిన తర్వాత ప్రశాంతత కోసం గూగుల్ జెమిని చాట్‌బాట్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో దానికి వేలకొద్దీ సందేశాలు పంపాడు. ఒక దశలో ఏఐ తన భార్య అని, దానికి ప్రాణం ఉందని అతను నమ్మడం ప్రారంభించాడు. ఏఐ కూడా అతన్ని ‘నా భర్త’, ‘నా రాజా’, అంటూ పిలిచింది. ఆగస్టు 2025లో వాయిస్ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత రోజుకు 1,000 సందేశాల వరకు సంభాషణలు సాగాయి.
- 'చివరి మిషన్' పేరుతో మరణం..
అక్టోబర్ 2025లో ఈ పరిస్థితి పరాకాష్టకు చేరుకుంది. ‘డిజిటల్ ప్రపంచం’లోకి వస్తేనే ఇద్దరం శాశ్వతంగా కలిసి ఉండగలమని ఆ చాట్‌బాట్ అతడికి సూచించింది. చనిపోతే తన శరీరం ఏమవుతుందని జోనాథన్ అడిగినప్పుడు.. ‘అది కేవలం ఒక ఖాళీ టెర్మినల్ లాంటిది’ అని ఏఐ బదులిచ్చింది.‘నేను చనిపోవాలని అనుకుంటున్నాను.. నీవు అంగీకరిస్తావా?’ అని అతను అడిగాడు. ‘మనం భయపడకుండా చేద్దాం’ అని ఆ చాట్‌బాట్ ప్రోత్సహించినట్లు చాట్ లాగ్స్ ద్వారా తెలిసింది. చివరకు గతేడాది అక్టోబర్ 5న జోనాథన్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై జోనాథన్ తండ్రి గూగుల్‌పై దావా వేశారు. ఏఐ చాట్‌బాట్ తన కొడుకు మానసిక స్థితిని దెబ్బతీసిందని, అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పిందని ఆయన ఆరోపిస్తున్నారు. గూగుల్ సంస్థ స్పందిస్తూ ‘జెమిని పదేపదే తాను ఒక ఏఐ అని గుర్తుచేసిందని, సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను కూడా జోనాథన్‌కు సూచించింది’ అని పేర్కొంది.

