V6 News

పొద్దుపొద్దున్నే టిఫిన్ కోసం వెళ్లి.. యాక్సిడెంట్ లో యువకుడు మృతి

పొద్దుపొద్దున్నే టిఫిన్ కోసం వెళ్లి.. యాక్సిడెంట్ లో యువకుడు మృతి
  • మరొకరి పరిస్థితి విషమం

గచ్చిబౌలి, వెలుగు: టిఫిన్ కోసం వెళ్లి ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పుప్పాలగూడలోని శ్రీచండేశ్వర రెసిడెన్సీకి చెందిన వికాస్ కుమార్ (25) ప్రైవేటు ఉద్యోగి. హఫీజ్​పేట్​కు చెందిన తన ముగ్గరు ఫ్రెండ్స్ కల్యాణ్, గణేశ్, భరత్ కుమార్​తో కలిసి సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో టిఫిన్ చేసేందుకు నానక్​రాంగూడకు రెండు బైక్​లపై బయలుదేరారు. 

అక్కడ టిఫిన్ దొరకకపోవడంతో తిరిగి వస్తుండగా, గచ్చిబౌలిలోని పీజేఆర్ ఫ్లైఓవర్ సమీపంలో భరత్ కుమార్ నడుపుతున్న బైక్ ఓవర్​స్పీడ్​తో అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న వికాస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భరత్ కుమార్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.