సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని ఓ యువకుడు రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. గురువారం ( ఫిబ్రవరి 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బీరంగూడకు చెందిన 24 ఏళ్ళ దత్తాత్రేయ ప్రేమ విఫలం కావడంతో దుర్వ్యసనాలకు అలవాటుపడ్డాడని.. లవ్ ఫెయిల్యూర్ ని జీర్ణించుకోలేక రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు బంధువులు.
దత్తాత్రేయ గతంలో కూడా ఐదు సార్లు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు బంధువులు.దుర్వ్యసనాలకు బానిసగా మారిన దత్తాత్రేయ డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు బంధువులు.
తెల్లాపూర్ రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న దత్తాత్రేయ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దత్తాత్రేయ మరణంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
