- యువకుడిపై పోక్సో కేసు
జూబ్లీహిల్స్ , వెలుగు: సోషల్ మీడియాలో పరిచయమైన మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిపై మధురానగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని ఓ కళాశాలలో చదువుతున్న బాలిక(17)కు స్నాప్‌చాట్ ద్వారా వెంకట్(20) అనే యువకుడు పరిచయమయ్యాడు.
స్నేహం పేరుతో బాలిక వివరాలు సేకరించిన అతను.. అనంతరం అసభ్యకర చాటింగ్‌కు దిగాడు. గతంలో బాలిక తల్లి హెచ్చరించినప్పటికీ వినకుండా, బాలిక కళాశాల వద్దకు వెళ్లి ఆమెపై దాడి చేయడమే కాకుండా తన కోరిక తీర్చాలంటూ వేధించాడు.
పలు నంబర్ల నుంచి ఫోన్ చేస్తూ, కోరిక తీర్చకుంటే మరింత టార్చర్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తల్లికి విషయం చెప్పగా, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
