పారడైజ్ మెట్రో స్టేషన్పైనుంచి దూకి.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పారడైజ్ మెట్రో స్టేషన్పైనుంచి దూకి.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పారడైజ్ మెట్రో స్టేషన్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం  దాదాపు 45 ఏండ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మెట్రో స్టేషన్ పై నుంచి కిందికి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్​లో గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై బేగంపేట పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ఆ వ్యక్తి మతిస్థిమితం సరిగా లేని వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.   పూర్తి వివరాలు  తెలియనున్నాయి.