
హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. చేపల వ్యాపారిని కిడ్నాప్ చేసి భారీగా డబ్బు డిమాండ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆ సొమ్ము ఇవ్వలేదని కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచెలో పెట్టి.. పడేసి వెళ్లిపోయారు.
ఎస్ఆర్ నగర్‌కు చెందిన చేపల వ్యాపారి రమేశ్‌ను రెండ్రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. అతడి కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పి రూ.90 లక్షల డబ్బు ఇస్తేనే వదులుతామని బెదిరించారు కిడ్నాపర్లు. మంగళవారం ఉదయం లోగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ, ఆ సొమ్ము ఇవ్వలేకపోవడంతో ఆ కిరాతకులు రమేశ్‌ని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి జూబ్లీహిల్స్‌లోని కల్యాణ్ నగర్‌లో ఓ ఇంట్లో పడేసి కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ ఇంటి నుంచి చెడ్డ వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ డెడ్ బాడీ రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన రమేశ్‌దేనని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన దుర్మార్గుల కోసం గాలిస్తున్నారు.