పెళ్లి చేసుకోవాలన్నందుకు చెట్టుకు ఉరేసిన ప్రేమికుడు

V6 Velugu Posted on Aug 03, 2021

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం.. సరస్వతి అనే యువతిగా నిర్దారణకు వచ్చారు. సరస్వతిని చున్నీతో గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. నిన్న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరస్వతి.. తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సరస్వతి బోయిన్‌పల్లిలోని ఒమేగా డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. సరస్వతికి ఓ వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని సరస్వతి ఆ వ్యక్తిపై ఒత్తిడి తీసుకురాగా.. అతను నిరాకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన వీరు తరచుగా కలుస్తూ ఉండేవారన్నారు. పెళ్లి విషయంలో ఘర్షణ చోటుచేసుకోవడంతో అతను ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తమకు న్యాయం చేయాలని.. తన బిడ్డను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని సరస్వతి తల్లి డిమాండ్ చేశారు

Tagged murder, love, marriage, Hanging, alwal, Love affair

Latest Videos

Subscribe Now

More News