గ్రహాంతరవాసి అని భయపడి ఇంటిని కాల్చేశాడు

గ్రహాంతరవాసి అని భయపడి ఇంటిని కాల్చేశాడు

ఎవరికైనా ఏదైనా  భయంకరమైన కొత్త వస్తువు కనపడిందంటే గుడ్లు తేలేస్తారు.  ఇంకా అది కదిలిందంటే చాలు వారు పడే భయం అంతా ఇంతా కాదు.  ఇప్పడు ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తికి అలాంటి ఘటనే ఎదురైంది.  తన ఇంట్లో తలుపు చాటున వింత జంతువును చూసి బెంబేలెత్తిపోయాడు.  ఇక అంతే గ్రహాంతరవాసి అనుకొని ఇంటిని కాల్చేశాడు. 

 ఆస్ట్రేలియాలో   ఓ వ్యక్తి తన ఇంట్లో గ్రహాంతరవాసి లాంటి వింత  జీవిని  గమనించాడు. ఆ జీవి ఏంటో తెలియక తికమక పడి ఏం చేయాలో అతనికే అర్దం కాలేదు.  దీంతో వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... ఆ జీవి ఏ జాతికి చెందినదో చెప్పండి అని పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ జీవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియన్ సోషల్ మీడియా యూజర్ తన ఇంట్లో  తలుపు వెనుక ఉన్న జీవిని  చూసి   బెరడు ముక్క లేదా ఆకుల కట్టగా భావించాడు.  కాని అది కదలడంతో భయపడ్డాడు.  ఆ జీవి ప్రవర్తన చూసి షాక్ కు గురయ్యాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఇంట్లో తలుపు వెనుక గ్రహాంతర వస్తువును చూశానని రాశాడు.  ఈ వస్తువు కదులుతుంది.. సజీవంగా ఉందంటూ.. అది ఏమిటో గుర్తించి చెప్పండి అని పోస్ట్ చేశాడు.  ఈ జీవి చాలా భయంకరంగా ఉందని.. దగ్గరకు వెళితే భయమేస్తుందని చెప్పాడు. చాలా నెమ్మదిగా కలుగుతుందన్నాడు.

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆస్ట్రేలియన్ ప్రజలు   స్పందించారు.  ఆ జీవి ఏమిటో తెలియక పోయినా .. ఒకరు ఇది ఏలియన్ vs ప్రిడేటర్‌కి సంబంధించినదని రాశారు. మరో వ్యక్తి బయటకు రావడానికి సమయం వచ్చిందని సరదాగా కామెంట్ చేశాడు.  మరొకరు తాను గతంలో ఇలాంటి పురుగు (జీవి)ను చూశానని చెప్పాడు. చివరకు ఆస్ట్రేలియన్ ప్రజలు  ఆ జీవిని (కేస్ మాత్) గొంగళి పురుగు గా గుర్తించారు. 

 కీటకాలు ఆస్ట్రేలియా తూర్పు తీరంలో సర్వసాధారణంగా ఉంటాయి.  ఈ కీటకాలు గొంగళిపురుగులా కనపడుతాయి, చాలా భయంగా కనిపిస్తాయి.  కాని ఇవి మానవులకు ఎలాంటి హాని చేయవు.  ఇవి ఎక్కువుగా మొక్కలను, చిన్న చిన్న కీటకాలను తింటాయి.  ఇంకా చీమల గూళ్లలో వాటి ఆహారాన్ని వెతుక్కుంటాయి,