యువకుడిని కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు

యువకుడిని కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు

హైదరాబాద్ : ఓ యువకుడిని స్నేహితులు కర్రలు, రాళ్లతో కొట్టిచంపిన ఘటన హైదరాబాద్ రామంతాపూర్ లో జరిగింది. ఆదివారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ప్రసాద్(26) అనే యువకుడిని కర్రలతో, రాళ్లతో కొట్టి చంపారు స్నేహితులు. ఆ తర్వాత నిందితులు పరార్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డెబ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హస్పిటల్ కి తరలించారు.

ఫ్రెండ్స్ మధ్య అంతర్గత కక్షలే హత్యకు ధారితీయొచ్చని.. ప్రసాద్ ని హతమార్చడంలో ఇద్దరు, లేదా ముగ్గురు ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. తమ కొడుకు ఎవ్వరి జోలికి పోడని..అనవసరంగా పొట్టనబెట్టుకున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు ప్రసాద్ తల్లిదండ్రులు.