
ఈ రోజుల్లో ఫ్యాషన్ పీక్ స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు పేదవాళ్లు, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇళ్లు లేక, డబ్బు లేని వాళ్లు చిరిగిపోయిన బట్టలు వేసుకునేవారు. కానీ ఇప్పుడు అదే చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఫ్యాషన్ అని పేరు పెడుతున్నారు. అదే తరహాలో ఓ యువకుడు న్యూస్ పేపర్స్ ను అమ్మాయి డ్రెస్సులా డిజైన్ చేయడమే కాకుండా, దాన్ని ధరించి, మోడల్ లా ఫోజులిచ్చాడు.
టిక్ టోకర్ తరుణ్ పేరుతో ఉన్న ఇన్ స్టా యూజర్ దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ యువకుడు నటి ఉర్ఫీ జావేద్ లా డ్రెస్సును ధరించాడు. కానీ మనం అనుకుంటున్నట్టు అతను ధరించింది బట్టలతో చేసిన డ్రెస్ కాదు. న్యూస్ పేపర్స్ తో తయారు చేసిన డ్రెస్సుతో. ఇలా వింత దుస్తులు ధరించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలవడం అతనికి కొత్తే కాదు. ఇంతకుమునుపు బంతి పూలను, కుల్ఫీ ఐస్ క్రీమ్ లను, గడ్డిని, చింతకాయలను.. డ్రెస్సులా అలంకరించుకుని, అమ్మాయిలా రెడీ అయ్యాడు. ఇలా వెరైటీ డ్రెస్సులో ఫన్నీ డ్రెస్సులు వేసుకుని ఆ యువకుడు చేసిన వీడియోలు ఇప్పటికీ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.