సమన్లు ఇవ్వడానికొచ్చిన పోలీసును చెప్పుతో కొట్టిన వ్యక్తి

V6 Velugu Posted on Jun 10, 2021

సంగారెడ్డి జిల్లా.. పటాన్‌చెరులో ఓ పోలీసుపై దాడి జరిగింది. ఓ కేసుకు సంబంధించి సమన్లు ఇవ్వడానికి వచ్చిన హోంగార్డుపై దాడిచేసి కొట్టారు.  అంబే ఇంటీరియర్ కంపెనీ యజమాని దేవి సింగ్‌కి ఓ కేసు విషయంలో సమన్లు ఇవ్వడానికి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డ్ కనకయ్య వచ్చాడు. సమన్లు ఇచ్చేలోపే.. కనకయ్య ఐడీ కార్డు, ఫోన్ నేలకేసి కొట్టి.. దేవి సింగ్ తన పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతో కలిసి దాడి చేశాడు. కనకయ్య ఫిర్యాదుతో పఠాన్‌చెరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడికి పాల్పడ్డ వారిని అదుపులో తీసుకున్నారు. నిందితులపై కేస్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

‘బాచుపల్లి హోంగార్డు కనకయ్యపై... నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఓ కేసు విషయంలో దేవీలాల్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు హోంగార్డు వెళ్లాడు. తాను పోలీసునని చెబుతున్నా వినకుండా.. ఆయన ఐడీ కార్డు, ఫోన్‌ను విసిరికొట్టి దాడి చేశారు. దేవీలాల్‌తో పాటు దాడికి పాల్పడిన అతని అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం’ అని సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

Tagged Hyderabad, Patancheru, Attack On Police, homeguard kanakaiah, ambe interior company, devi singh

Latest Videos

Subscribe Now

More News