- ఓటమి భయంతో ఈ నెల 8న ఆత్మహత్య
- 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం
రాయికోడ్, వెలుగు: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపాడ్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా చాల్కి రాజు పోటీ చేశాడు. ఓటమి భయంతో ఈ నెల 8న ఆత్మహత్య చేసుకోగా, ఆదివారం జరిగిన ఎన్నికలో చాల్కి రాజు 9 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
అభ్యర్థి మృతి చెందినప్పటికీ, పోలైన ఓట్లను లెక్కించాల్సి ఉండడంతో నిబంధనల ప్రకారం ఆయనను సర్పంచ్‌గా గెలుపొందినట్లు ప్రకటించారు. రాజు గెలిచినట్లు ప్రకటించడంతో గ్రామస్తులు మృతుడి ఇంటికి చేరుకొని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం ఆయన ఫ్యామిలీకి న్యాయం చేయాలని కోరారు.
