మున్సిపల్ కార్మికుల బకాయిలు రూ.1.33 కోట్లు చెల్లింపు

మున్సిపల్ కార్మికుల బకాయిలు రూ.1.33 కోట్లు చెల్లింపు

మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: నస్పూర్ మున్సిపల్​ కార్మికులకు 2019 నుంచి 2026 వరకు ఈపీఎఫ్, ఈఎస్​ఐ బకాయిలను చెల్లించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్​గెస్ట్​గా హాజరైన ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు చేతుల మీదుగా కార్మికుల బకాయిలు రూ.1.33 కోట్లకు సంబంధించిన చెక్కు అందజేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

లక్సెట్టిపేటలో జరిగిన కార్యక్రమంలో లక్సెట్టిపేట, దండేపల్లి , మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కమిషనర్ అన్వేష్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, లక్సేట్టిపేట మున్సిపల్ చైర్​పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్​పర్సన్ మోత్కూరి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.