మేడారంలో అంగరంగ వైభవంగా.. మండ మెలిగె..

మేడారంలో అంగరంగ వైభవంగా..  మండ మెలిగె..

తాడ్వాయి : మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల మండ మెలిగే పండుగను పూజారులు - అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవాళ ఉదయాన్నే మేడారం సమ్మక్క దేవత పూజరులు సిద్దబోయిన, కొక్కెర, మల్లెల, వంశీయులు, నె రాలమ్మ పూజారులు కాక వంశీయులు వారి వారి ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. అనంతరం పిల్లాపాపలతో సహా పవిత్ర స్నానాలు చేశారు. సమ్మక్క పూజారులు మేడారం గుడికి సారల మ్మపూజారులు కన్నెపెళ్లి గుడికి వెళ్లి గుడులను పవిత్ర గోదావరి జలంతో శుద్ధి చేశారు. 

అనంతరం సమ్మక్క పూజారి ఆయన సిద్ధబో యిన నితిన్, సారలమ్మ పూజారి అయిన కాక సారయ్య ఇండ్ల వద్ద డోలు వాయిద్యాల నడుమ మామిడాకు తోరణాలను కట్టారు. అక్కడినుం డి పూజారులు ఆడపడుచులు (ఆడబిడ్డలు) పూజా సామగ్రితో మంగళ హారతులతో ఆయా గుడులకు చేరుకున్నారు. ఆడబిడ్డలు అడవి నుంచి తెచ్చిన పుట్ట మన్నుతో గుడులను అలికి ముగ్గులు వేశారు. అనంతరం పూజారులు డోలు వాయిద్యాల నడుమ బొడ్రాయి, ముత్యా లమ్మ, భూలక్ష్మి, మహాలక్ష్మి లకు నూతన వస్త్రా లు పెట్టి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. 

►ALSO READ | మున్సి‘పోల్స్' బరిలో మరో 3 పార్టీలు..! పోటీకి సై అంటున్న టీడీపీ, జనసేన, జాగృతి

అక్కడ నుంచి నేరుగా ఆలయం ముందు బురికా స్తంభాలతో తోరణా నికి చీడపీడలు రాకుండా కోడిపిల్ల, సొరకాయ, మిరపకాయ, మామిడి, వేప మండలు కట్టి తోరణం కట్టారు. అనంతరం గ్రామ పొలిమే రలల్లో బూరిక చెట్లతో తోరణాలు కట్టారు. సాయంత్రం డోలు వాయిద్యాల నడుమ గద్దెల వద్దకు చేరుకొని గద్దెల వద్ద రహస్య పూజలు చేశారు. దీంతో మహాజాతరకు అంతా సిద్ధమ ని పూజారులు తెలిపారు.