- కామన్ సింబల్తో పోటీకి కవిత కసరత్తు
- పోటీకి సిద్ధమంటున్న తెలుగుదేశం పార్టీ
- బరిలోకి దిగనున్న జనసేన
- ఒంటరి పోరుకు గిరిగీసుకున్న బీజేపీ టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా?
- రాష్ట్రంలో మారనున్న రాజకీయ సమీకరణాలు
హైదరాబాద్: ఈ సారి మున్సిపల్ ఎన్నికలు రసవత్త రంగా సాగనున్నాయి. చాలా కాలంగా పోటీకి దూరంగా ఉన్న ఏపీ పార్టీలు తెలంగాణలోకి దూసుకొస్తున్నాయి. వీటికి కవిత పెట్టబోయే కొత్త పార్టీ తోడవుతోంది. అప్పటి వరకు పార్టీ గుర్తు ఫైనల్ కాకుంటే ఇక్కడ పెద్దగా ప్రచారం లేని పార్టీల కామన్ సింబల్‌పై తమ అనుకూలురను రంగంలోకి దించేందుకు మాజీ ఎమ్మెల్సీ కవిత సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు యువకులు, మహిళలకు అవకాశం కల్పిస్తామని, అవసరమైతే తాను కూడా వచ్చి ప్రచారం చేస్తానని ఆమె ప్రకటించారు. ఇదిలా ఉండగా 2018 ఎన్ని కల తర్వాత తెలంగాణలో పోటీ చేయని తెలుగుదేశం పార్టీ ఈ సారి పోటీకి రెడీ అవుతోందని తెలుస్తోంది. దీంతో పాటు ఆ పార్టీకి ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంద ని సమాచారం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్ని కల సన్నాహక పనులను ప్రారంభించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల అవసరాలకు అనుగుణంగా వాటిని పునర్నిర్మించే ప్రణాళికలతో, పార్టీ తెలంగాణలోని వివిధ స్థాయిలలోని తన రాజకీయ కమిటీలను రద్దు చేసింది. పొత్తుపై బీజేపీతో చర్చలు త్వరలోనే జరిగే అవకాశం ఉందని తెలంగాణకు చెందిన నాయకుడొకరు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తమ పార్టీ పొత్తులు లేకుండా మున్సిపల్ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించడంతో అనిశ్చితి కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో బీజేపీకి పొత్తు ఉంది. ఇక్కడ వేర్వేరుగా పోటీ చేస్తారా..? లేక టీడీపీ.. జనసేన కలిసి బరిలోకి దిగుతాయా..? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆగస్టు 2024లో తెలంగాణ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో, రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించి బలోపేతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సంస్థాగత పునర్నిర్మాణం, సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని కూడా ఆయన నాయకులను కోరారు. ఈ నేపథ్యంలో, తెలంగాణలో టీడీపీ, జనసేన మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా మరో మూడు రాజకీయ పార్టీలు తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది.
