
- మండలి బుద్ధ ప్రసాద్
బషీర్బాగ్, వెలుగు: ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహోన్నతుడు బబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం రవీంద్రభారతిలో సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి సామాజిక, సాంస్కృతిక వత్రోత్సవ వేడుక, ఆయనకు సంగమం జీవన సాఫల్య పురస్కారం- 2025 ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా ఏపీ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. సాంస్కృతిక, సామాజిక రాజకీయ రంగాల్లో గోపాలకృష్ణ విశేష సేవలు అందిచారని కొనియాడారు.
ఆయన నికార్సయిన గాంధేయవాది అని, మరుగున పడ్డ ఎందరో కళాకారులకు వెలుగులోకి తెచ్చారన్నారు. విశ్రాంత ఐఏఎస్ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. బబ్బెళ్లపాటి గొప్ప మహానుభావుడు అని, 60 ఏండ్లు ఒకే పార్టీలో ఉన్నారన్నారు. సుద్దాల అశోక్ తేజ, మాజీ ఎంపీ తులసి రెడ్డి, మంజుల భార్గవి, వసంత నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.