
బషీర్‌బాగ్ వెలుగు: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్ సంయుక్తాధ్వర్యంలో రవీంద్రభారతిలో ‘పాటే నా ప్రాణం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పలు రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులను సన్మానించారు. సంగీత దర్శకుడు, సింగర్ మధుబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
అతిథులుగా సినీ నటుడు తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు కోటి, సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి పాల్గొని వాస్తు శాస్త్ర నిపుణుడు కాశీనాథుని శ్రీనివాస్‌ను ‘కాశీనాథన్న.. వాస్తు శ్రీనన్న’అనే బిరుదుతో సత్కరించారు. వాస్తు శాస్త్రంలో అందిస్తున్న సేవలకు శ్రీనివాస్‌కు దక్కిన గౌరవం అని అతిథులు అభివర్ణించారు.