Rohit Sharma: రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడం భారత యాజమాన్యానికి ఇష్టం లేదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Rohit Sharma: రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడం భారత యాజమాన్యానికి ఇష్టం లేదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో విఫలమయ్యాడు. కెప్టెన్సీ నుంచి తొలగించాక ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై జరిగిన సిరీస్ లో దుమ్ములేపిన హిట్ మ్యాన్.. కివీస్ తో జరిగిన సిరీస్ లో రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్ ల్లో 61 పరుగులు చేసి నిరాశపరిచాడు. రోహిత్ విఫలం కావడంతో అతన్ని జట్టు నుంచి తప్పించడానికి జట్టు టీమిండియా ఎదురు చూస్తూ ఉంటుందని భారత జట్టు మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ 2027 వన్డే వరల్డ్ కప్ కు రోహిత్ ను ఆడకుండా చేయాలనీ జట్టు యాజమాన్యం ప్రయత్నిస్తుందని తివారి చెప్పాడు. 

రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఇలా అన్నాడు.. "రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించబడినప్పుడు, కొంతమంది అతను విఫలం కావాలని కోరుకున్నారని నాకు తెలుసు. రోహిత్ ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్ లో విఫలమై ఉంటే సెలెక్టర్లు అతన్ని తొలగించాల్సి వచ్చేది. జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన వ్యక్తిని కెప్టెన్‌గా తొలగించడం ఎంతవరకు కరెక్ట్..?

మేనేజ్‌మెంట్ రోహిత్ ను వన్డే వరల్డ్ కప్ కు వెళ్లకూడదని కోరుకుంటుంది. కానీ రోహిత్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై అద్భుతంగా ఆడి తనలో ఇంకా క్రికెట్ ఉందని నిరూపించాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో రాణించలేనంత మాత్రనా రానున్న సిరీస్ లో ఆడలేడు అనుకోకూడదు. రోహిత్ 3 డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్. అతనికి మనం గౌరవం ఇవ్వాలి". అని తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ కెప్టెన్సీకి చెక్:
 
చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి దూరమైన హిట్ మ్యాన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్ లను కొనసాగడం బీసీసీఐ ఆలోచనల్లో లేనట్టు స్పష్టమవుతుంది. రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆడడం దాదాపుగా ఖాయమైంది.  ఫిట్ నెస్ లో హిట్ మ్యాన్ కు సమస్యలు ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో సైతం రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దీంతో పాటు ఇప్పటి నుంచే గిల్ కు కెప్టెన్ గా అవకాశమిస్తే 2027 వరల్డ్ కప్ లోపు అనుభవాన్ని సంపాదించుకుంటాడనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం.