IND vs NZ: న్యూజిలాండ్‌తో రేపు (జనవరి 23) రెండో టీ20.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ ఇద్దరిపై ఒత్తిడి

IND vs NZ: న్యూజిలాండ్‌తో రేపు (జనవరి 23) రెండో టీ20.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ ఇద్దరిపై ఒత్తిడి

న్యూజిలాండ్ పై తొలి టీ20లో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా రెండో టీ20కి సిద్ధమవుతోంది. శుక్రవారం (జనవరి 23) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. 5 మ్యాచ్య్ ల వన్డే సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 లోనూ గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. ఎలాగైనా ఇండియాను ఓడించి సిరీస్ ను సమ చేయాలని న్యూజి లాండ్ పట్టుదలగా ఉంది. మ్యాచ్ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. 

మార్పులు లేకుండానే భారత జట్టు:

తొలి టీ20లో గెలిచిన టీమిండియా రెండో టీ20కి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన మన జట్టు రెండో టీ20 కోసం ఎలాంటి మార్పులు చేయడం లేదు. అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ మూడో స్థానంలో ఆడతాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు వస్తాడు. ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య స్థానానికి ఎలాంటి ఢోఖా లేదు. ఆరో స్థానంలో రింకూ సింగ్.. ఏడో స్థానంలో శివమ్ దూబే ఆడతారు. ఎనిమిదో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్థానం పక్కా. వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా,అర్షదీప్ సింగ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా కొనసాగుతారు. 

కిషాన్, సంజుపై ఒత్తిడి:

వరల్డ్ కప్ కోసం ఎంపికైన ఇద్దరు వికెట్ కీపర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషాన్ న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో విఫలమయ్యారు. సంజు శాంసన్ రెండు ఫోర్లు కొట్టి 10 పరుగులకే ఔటయ్యాడు. మరోవైపు కిషాన్ 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. శాంసన్ నిలకడపై మరోసారి ప్రశ్నలు వస్తున్నాయి. ఎప్పుడో ఒకటే మ్యాచ్ ఆడతాడని విమర్శకు వస్తున్నాయి. ఓపెనర్ గా శాంసన్ త్వరాగా కుదురుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కిషాన్ ప్లేయింగ్ 11లో చోటు సంపాదించినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వీరిద్దరూ రెండో టీ20 మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు యాజమాన్యం కోరుకుంటుంది.