
తొర్రూరు, వెలుగు: మామిడికాయలు దొంగిలించడానికి వచ్చారంటూ ఇద్దరు పిల్లలను తోట కాపలాదారులు కట్టేసి కొట్టి పెండ తినిపించిన ఘటన మహబూబాబాద్జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చోటుచేసుకుంది. తొర్రూరులోని సాయినగర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు కంఠాయపాలెం శివారు మామిడితోటలో కాయలు దొంగిలించడానికి వచ్చారంటూ కాపలాదారులు పట్టుకున్నారు. పిల్లల చేతులను కట్టేసి కట్టెలతో కొట్టారు. తాము దొంగతనానికి రాలేదని పిల్లలు చెప్పినా వినిపించుకోలేదు. పిల్లలతో పెండ తినిపించారు. ఈ ఘటన మొత్తాన్ని సెల్ఫోన్లో వీడియో తీసి లోకల్ వాట్సప్ గ్రూపులో పోస్టు చేశారు. దీంతో వీడియో ఒక్కసారిగా వైరలైంది. కుక్క కనిపించకపోవడంతో పిల్లలు తోటలోకి వెళ్లారని పోలీసులు చెప్పారు. పిల్లలతో దారుణంగా వ్యవహరించిన బోతల తండాకు చెందిన బానోత్ యాకు, హచ్చు తండాకు చెందిన బోనోత్ రాములుపై పలు సెకక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.