స్ట్రెస్​తో గోర్లు కొరుకుతున్నారా!

స్ట్రెస్​తో గోర్లు కొరుకుతున్నారా!

యాంగ్జైటీ, స్ట్రెస్​తో ఉన్నప్పుడు, బోర్​గా అనిపించి నప్పుడు ఏం చేయాలో తోచదు చాలామందికి. దాంతో తెలియకుండానే గోర్లు కొరుకుతుంటారు. అప్పుడు ఉన్న సిచ్యుయేషన్ నుంచి రిలీఫ్ కోసమే వాళ్లు గోర్లు కొరుకుతారని అంటోంది డైటీషియన్ ఐశ్వర్య విచారె. ఈ అల వాటు మానేయడానికి ఆమె చెప్తున్న టిప్స్​ కొన్ని..
గోర్లు కొరికే అలవాటుని ‘ఒనికోఫాగియా’ అంటారు. అమెరికన్​ సైకియాట్రిక్ అసోసియేషన్​ ప్రకారం ‘‘గోర్లు కొరకడం అనేది తెలియకుండా, సహజంగా జరిగిపోతుంది. చాలామంది నెర్వస్, ఒత్తిడి, టెన్షన్​, ఒంటరితనం నుంచి బయటపడేందుకు  గోర్లు కొరుకుతారు. ఇంకొందరు ఆకలి వేసినప్పుడు కూడా  గోర్లు కొరుకు తారు’’. ​ఈ సమస్యకు జెనెటికల్, సైకియాట్రిక్  కారణాలు కూడా ఉన్నాయి. ఈ అలవాటు ఉన్నవాళ్ల గోర్లు విరిగినట్టు ఉంటాయి. దాంతో అన్నం తినేటప్పుడు పదునైన గోర్ల అంచులు తగిలి, చిగుళ్లకు గాయాలయ్యే ఛాన్స్​ ఉంది. అంతేకాదు గోర్ల దగ్గరి క్యుటికిల్​ (మెత్తని చర్మం) కూడా దెబ్బతింటుంది. అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్​, వైరస్​ వంటివి చేరతాయి. చేతితో తినేటప్పుడు ఇవి పొట్టలోకి వెళ్లి, రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. 

ఈ అలవాటు మానేందుకు

టెన్షన్​లో ఉన్నప్పుడు గోర్లు కొరకడం మానేయాలంటే నోటికి మౌత్​ గార్డ్​ పెట్టుకోవాలి. గోర్లకు ఘాటు వాసన, చేదు రుచి ఉన్న నెయిల్​ పాలిష్​ పెట్టాలి. గోర్లని చిన్నగా కత్తిరించుకోవాలి.  ముఖ్యంగా టెన్షన్​గా, ఒంటరిగా ఉన్నప్పుడు గోర్లు కొరకకుండా ఉండేందుకు చూయింగ్​ గమ్​, సోంపు వంటివి నమలాలి. ఈ సమస్య ఉన్నవాళ్లు పర్మినెంట్​ సొల్యూషన్​ కోసం డాక్టర్​ని కలిస్తే బెటర్.