ములుగు జిల్లా ఏజన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. నేటి నుంచి సెప్టెంబర్ 27 వరకు మావోయిస్టు పార్టీ18వ వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతీ గ్రామంలోనూ ఉత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. పట్టుకోసం మావోయిస్టుల ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు అడవిని జల్లడపడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంపైనా పోలీసులు నిఘా పెంచారు. మావోయిస్టు సానుభూతి పరులపై కన్నేసిన పోలీసులు... గ్రామాలు, గూడాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల సోదాల క్రమంలో ఏజెన్సీ గ్రామాలు, ఆదివాసీ గూడాలు భయం గుప్పెట్లో ఉన్నాయి.
