
బషీర్‌బాగ్, వెలుగు: భారత భౌగోళిక విస్తీరణంపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైఫాబాద్‌లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో మ్యాప్ గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేష్ కుమార్ మక్వనా తెలిపారు. జి.పి. బిర్లా పురావస్తు, ఖగోళ, వైజ్ఞానిక సంస్థ చైర్పర్సన్ నిర్మల బిర్లా, బి.ఎం. బిర్లా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మృత్యుంజయ రెడ్డితో కలిసి ఈ గ్యాలరీని సోమవారం ఆయన ప్రారభించారు.
1756లో ప్రారంభమైన సర్వే ఆఫ్ ఇండియా చరిత్ర, ఆనాటి మ్యాప్‌లు, పరికరాలు, ప్రధాన గెజిట్లు, బ్రిటీష్ కాలం నాటి రాజముద్రలను ఈ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. 250 ఏండ్ల క్రితం సర్వే ఆఫ్ ఇండియా పనితీరు, అప్పటి పరిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేయడానికి ఈ గ్యాలరీ ఉపయోగపడుతుందని హితేష్ కుమార్ తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో గ్యాలరీని మరింత విస్తరిస్తామని మృత్యుంజయ
రెడ్డి తెలిపారు.