కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించిన ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు

కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించిన ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు

2023 లో మొదటి సెషన్‌‌‌‌‌‌‌‌ను పాజిటివ్‌‌‌‌గా ముగించిన ఇండెక్స్‌‌‌‌లు

ముంబై : బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. దేశ మాక్రో ఎకనామిక్ డేటా మెరుగ్గా ఉండడం, యూరోపియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పాజిటివ్‌‌‌‌‌‌‌‌ ట్రెండ్ కనిపించడంతో సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీలు సోమవారం  లాభపడ్డాయని  ఎనలిస్టులు పేర్కొన్నారు. 30 షేర్లున్న సెన్సెక్స్ 327 పాయింట్లు (0.54 శాతం) పెరిగి 61,168 వద్ద సెటిలయ్యింది. నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 18,197 దగ్గర ముగిసింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లో టాటా స్టీల్,  టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్‌‌‌‌‌‌‌‌, టైటాన్‌‌‌‌‌‌‌‌, టెక్ మహీంద్రా, సన్‌‌‌‌‌‌‌‌ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి. దేశ ఎకానమీ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉందనడానికి కిందటి నెలలో పెరిగిన జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వసూళ్లు  నిదర్శనమని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.  

మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ కూడా 13 నెలల గరిష్టానికి  చేరుకోవడం స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలిచిందని  పేర్కొన్నారు. ‘గ్లోబల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు  సెలవులో ఉన్నవేళ మన మార్కెట్‌‌‌‌‌‌‌‌లు 2023 ను పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించాయి.  ఎకానమీ స్ట్రాంగ్ ఉండడం, కంపెనీల లాభాలు మెరుగ్గా ఉంటాయని అంచనాలతో ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు లాభపడుతున్నాయి’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్ వెలువడనుండడం, బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కూడా ఉండడంతో రానున్న సెషన్లలో నిఫ్టీ నిలకడగా ఉంటుందని అంచనావేశారు. నిర్ధిష్టమైన సెక్టార్లు ఎక్కువగా కదులుతాయని అన్నారు.  బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ సోమవారం 0.84 శాతం లాభపడగా, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ 0.57 శాతం పెరిగింది. మెటల్‌‌‌‌‌‌‌‌, టెలీకమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, కమొడిటీస్‌‌‌‌‌‌‌‌, రియల్టీ, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు లాభాల్లో ముగిశాయి.