V6 News

3 రోజుల్లో రూ.7 లక్షల కోట్ల లాస్‌‌‌‌‌‌‌‌..వరుస పతనాలతో స్టాక్ మార్కెట్ కుదేలు 

3 రోజుల్లో రూ.7 లక్షల కోట్ల లాస్‌‌‌‌‌‌‌‌..వరుస పతనాలతో స్టాక్ మార్కెట్ కుదేలు 
  •  సెన్సెక్స్ శుక్రవారం 1,000 పాయింట్లు డౌన్‌‌‌‌‌‌‌‌
  • 106 డాలర్ల దగ్గర ఆయిల్‌‌‌‌‌‌‌‌, 
  • 94.16 కి చేరిన రూపాయి

ముంబై: ఇండియా స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ పడింది. సెన్సెక్స్ శుక్రవారం 1,000 పాయింట్లు నష్టపోయి 76,664 వద్ద ముగియగా,  నిఫ్టీ 275 పాయింట్లు తగ్గి 23,897కి చేరింది.  మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌, స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌ సూచీలు సెషన్‌‌ను  పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా మొదలు పెట్టినప్పటికీ, చివరికి ఒక శాతం నష్టపోయాయి. గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.7.17 లక్షల కోట్లు కోల్పోయారు.  ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో  నిఫ్టీ, సెన్సెక్స్ 3.29 శాతం పతనమయ్యాయి.   ఇరాన్–అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలతో మార్కెట్ పడుతోంది.

హార్మూజ్‌‌‌‌‌‌‌‌ జలసంధి వద్ద ఇరాన్‌‌‌‌‌‌‌‌ రెండు కార్గో షిప్‌‌‌‌‌‌‌‌లను స్వాధీనం చేసుకోవడంతో సరఫరా ఆగిపోతుందనే  ఆందోళన పెరిగింది. దీనికితోడు అమెరికా బ్లాకేడ్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఫలితంగా బ్రెంట్‌‌‌‌‌‌‌‌ క్రూడ్‌‌‌‌‌‌‌‌ ధరలు 2శాతం పైగా పెరిగి 107 డాలర్లను దాటాయి. అమెరికా క్రూడ్‌‌‌‌‌‌‌‌ డబ్ల్యూటీఐ బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు  98 డాలర్లకు చేరింది.   ఎఫ్​ఐఐలు వెళ్లిపోతుండడం,  ఆయిల్ ధరలు పెరగడం,  రూపాయి  తగ్గడంతో సూచీలు డీలా పడ్డాయి. రూపాయి విలువ 15 పైసలు తగ్గి రూ.94.16 వద్ద ముగిసింది.