జ్యోతిష్యం: కుజ దోషంతో జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.. పరిష్కారానికి ఏం చేయాలి..!

జ్యోతిష్యం: కుజ దోషంతో జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..  పరిష్కారానికి ఏం చేయాలి..!

జ్యోతిష్య శాస్త్రంలో  కుజ గ్రహానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది.  ప్రతి ఒక్కరి జీవితంలో కుజుడు కీలకపాత్ర పోషిస్తాడు.  ఆస్ట్రాలజిస్ట్​ లు తెలిపిన వివరాల ప్రకారం వ్యక్తిగత జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే అలాంటి వారు అపేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.  కుజుడు వలన కలిగే ఇబ్బందులు ఏమిటి.. ఇబ్బందులు తొలిగేందుకు ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

ఒక వ్యక్తి జాతకంలో కుజుడు  బలహీన స్థితిలో ఉంటే, వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మనం ఎంతసమయస్ఫూర్తిగా.. ఓపిక.. ఓర్పు.. సహనం పాటించినా  కష్టాలు వస్తాయి.  ఇతరులతో ఎలాంటి కారణం లేకుండానే వాదిస్తారు.  అంతేకాదు  ఎక్కువుగా ప్రమాదాలు జరగడం..  గాయాలు కావడం కూడా సంభవిస్తాయి. ఎంత సంపాదించినా అప్పుల బాధలు వేధిస్తాయి.  తోబుట్టువులతో గొడవలు.. స్నేహితులు.. బంధువులతో అభిప్రాయ బేధాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కుజుడు బలహీన స్థితిలో ఉంటే చేపట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు వస్తాయి.  ఆత్మవిశ్వాసం కోల్పోతారు,  ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కోపం.. ఆవేశం ఎక్కువ అవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

అంతే కాకుండా తరచూ  ఉద్యోగాన్ని కోల్పోవడం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు రావడం.  వివాహ ప్రయత్నాలు ఫలించక పోవడం,  కుటుంబ సమస్యలు వేధిస్తాయి అందుకే జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించడంతో పాటు పరిహారాలు కూడా చేయాలి. 

కుజదోషం.. పరిష్కార మార్గాలు 

  • జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే వచ్చే దుష్పఫలితాలను .. చెడు ప్రభావాలను నివారించేందుకు మంగళవారం వ్రతం పాటించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం స్నానం చేసి.. పూజ అయిన తరువాత.. కుక్కలకు రొట్టెలు కాని.. బిస్కెట్లు కాని తినిపించండి.ఇలా చేయడం వలన జాతకంలో కుజుడు బలపడతాడు.
  •  మంగళవారం రాత్రి, మీ మంచం దగ్గర శుభ్రమైన నీటితో నింపిన రాగి పాత్రను ఉంచండి. ఉదయం, ఆ నీటిని ఒక మొక్క వేళ్ళకు పోయండి.  ఇలా చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది ఈ పరిహారం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
  •  మంగళవారాల్లో గుడికి వెళ్లి  పేదలకు కందిపప్పు,  బెల్లం దానం చేయండి. దీనివలన  కుజుడి ప్రతికూల ప్రభావాలను తగ్గి సంతోషం .. శ్రేయస్సు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. 
  • మంగళవారం ఈ క్రింది తెలిపిన మంత్రాలలో ఏదేని ఒకటి 11 సార్లు శ్రద్దగా చదవండి
  • కుజుడి మంత్రం:ఓం భౌమయ నమః”
  • కుజుడి బీజ మంత్రం:“ఓం క్రం క్రీం క్రం సః భౌమాయ నమః
  •  ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
  • ఎర్రని పుష్పాల మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
  • బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
  • స్త్రీలు ఏడు మంగళవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
  • రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
  • నవగ్రహాలు ఉన్న  గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపూలతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
  • ముఖ్యంగా ప్రతి మంగళ వారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. 
  •  మంగళ, శని వారాల్లో హనుమాన్ దేవాలయాలను సందర్శించడం, నెయ్యి దీపం వెలిగించడం, అరటి పండ్లు దానం చేయ్యడం చేయడం శుభప్రదం.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.