నవంబర్ 15న ఓదెల దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతం

నవంబర్ 15న ఓదెల దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతం

సుల్తానాబాద్, వెలుగు: ఓదెల శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 15న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం ఆలయంలో ఆవిష్కరించారు. 

అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోరిక మేరకు ఈ ఏడాది నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వ్రతం ఆచరించాలనుకునే వారు రూ.500 చెల్లించి, రసీదు పొందాలని, పూజా సామగ్రి తామే ఇస్తామని పేర్కొన్నారు.